![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 '(Karthika Deepam2'). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -711 లో..... జ్యోత్స్నకి శివన్నారాయణ పనిష్మెంట్ ఇస్తాడు. అదేంటంటే ఒక పేపర్ లో జ్యోత్స్న చేయవలిసిన పనులు రాస్తాడు. అవి కార్తీక్ ని చదవమని శివన్నారాయణ చెప్తాడు. కార్తీక్ చదవడం మొదలుపెడతాడు. జ్యోత్స్న D.A గా ఉండాలి. అంటే దీప అసిస్టెంట్, ఆఫీస్ కి దీప కంటే ముందు రావాలి.. దీప ఇంటికి వెళ్లాకే జ్యోత్స్న వెళ్ళాలి. తనకి కార్ సౌకర్యం ఉండదు.. ఇంకా తను కంపెనీ నుంచి ఎలాంటి డబ్బు వాడుకోవడానికి వీలు లేదు.. తన అకౌంట్స్ అన్ని బ్లాక్ చేయబడుతాయి. తనకి శాలరీ వస్తుంది. అందులో నుంచి తన ఖర్చులకి వాడుకోవాలి.. జ్యోత్స్న శాలరీ కూడా దీప డిసైడ్ చేస్తుందని కార్తీక్ చదువుతాడు. అదంతా విని జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు.
అవన్నీ అవసరమా అని శివన్నారాయణని పారిజాతం అడుగుతుంది. ఒకప్పుడు రాజులు తమ పిల్లలని అడవులకి పంపించేవాళ్ళు.. వాళ్ళు సొంతజీవితం అంటే ఏంటో తెలుసుకోవాలని.. మళ్ళీ తీరిగి వచ్చి రాజు కుర్చీలో కూర్చునేవాళ్ళని శివన్నారాయణ చెప్తాడు. దీప జీవితంలో కూడా అలాగే జరిగింది. ఇప్పుడు రాజు కుర్చీలో కూర్చుందని కార్తీక్ అనుకుంటాడు. నచ్చితే చెయ్యొచ్చు.. సంతకం పెట్టొచ్చు లేదా వెళ్లిపోవచ్చని శివన్నారాయణ అంటుంటే జ్యోత్స్న అన్ని కండిషన్స్ కి ఒప్పుకుని సంతకం పెడుతుంది. ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి సూరజ్ వచ్చి మాట్లాడతాడు. నువ్వు శివన్నారాయణ గారికి మనవరాలు అన్న ట్యాగ్ తీసేస్తే.. నీ పొజిషన్ ఇది అని సూరజ్ అంటుంటే జ్యోత్స్నకి కోపం వస్తుంది. ఆ తర్వాత దీప రూమ్ ముందు జ్యోత్స్నకి ఒక క్యాబిన్ వేస్తారు. నువ్వు ఇక్కడే కూర్చోవాలి. దీప ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలని కార్తీక్ చెప్తాడు. దీప సరదాగా బెల్ నొక్కుగానే జ్యోత్స్న వెళ్తుంది. ఏంటని జ్యోత్స్న అడుగగా పని చేస్తుందో లేదో టెస్ట్ చేశానని దీప అంటుంది. ఆ తర్వాత కార్తీక్ కూడా బెల్ నొక్కుతాడు.. టెస్ట్ చేసానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత క్లర్క్ వచ్చి దీపకి కాఫీ ఇచ్చి మేడమ్ అంటాడు. జ్యోత్స్న ఒక్కటి తక్కువ అయింది అర్థం అయిందా అని అడుగుతుంది. అర్థం అయింది మేడమ్ అని జ్యోత్స్న అంటుంది.
అదంతా చూస్తున్న పారిజాతానికి జ్యోత్స్న పరిస్థితి చూసి ప్రాణంపోయినట్లుగా అనిపిస్తుంది. ఆ తర్వాత దీప, జ్యోత్స్న, కార్తీక్ కలిసి భోజనం చేస్తారు. కర్రీ వేసుకో జ్యోత్స్న.. తినే దగ్గర అందరూ సమానమే అని దీప అంటుంది. దీప తాళి చూసి అది నీ మెడలో ఉంది కాబట్టి నువ్వు సీఈఓ అయ్యావ్.. అదే నా మెడలో ఉండి ఉంటే చైర్మన్ అయ్యేదాన్ని అని జ్యోత్స్న అనుకుంటుంది. జ్యోత్స్న స్పూన్ కిందపడుతుంది. వెంటనే కార్తీక్ స్పూన్ ని జ్యోత్స్న తీసుకొని తింటుంటే ఆగవే అని దీప అంటుంది. అప్పుడే సూరజ్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |